Telangana : నేటి నుంచి సన్న బియ్యం పంపిణీ
తెలంగాణలో నేడు సన్న బియ్యం పంపిణీ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ లో ప్రారంభించనున్నారు;

తెలంగాణలో నేడు సన్న బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. హుజూర్ నగర్ లో పేదలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీని ప్రారంభిస్తారు. ప్రతి ఒక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని నేడు ప్రారంభించనున్నారు.
3.56 కోట్ల మంది...
దాదాపు 3.56 కోట్ల మందికి సన్న బియ్యం ఈరోజు నుంచి రేషన్ కార్డు దారులందరికీ అందుతుంది. ఇందుకు తగిన ఏర్పాట్లను చేశారు. రైతులను నుంచి సేకరించిన సన్న బియ్యాన్ని రేషన్ దుకాణాలలో పంపిణీ చేయాలని నిర్ణయించారు. సన్న బియ్యంతో పాటు సరుకులను కూడా పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.