నిన్న కలెక్టర్.. నేడు ఎమ్మెల్సీ
మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.;
మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆయన సిద్దిపేట కలెక్టర్ గా మొన్నటి వరకూ పనిచేశారు. ఆయన తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా కూడా ఆమోదం పొందింది. వెంకట్రామిరెడ్డి తన రాజీనామా ఆమోదం పొందిన వెంటనే టీఆర్ఎస్ లో చేరారు.
ముందుగానే హామీ?
వెంకట్రామిరెడ్డికి ఈరోజు కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఐఏఎస్ అధికారి నుంచి వెంకట్రామిరెడ్డి పెద్దల సభలోకి ప్రవేశించబోతున్నారు. కేసీఆర్ ముందగా హామీ ఇచ్చిన కారణంగానే ఆయన తనపదవికి రాజీనామా చేసినట్లు కనపడుతుంది. మొత్తం మీద మాజీ కలెక్టర్ ప్రజా ప్రతినిధి అవతారం ఎత్తబోతున్నారు. సిద్ధిపేట కలెక్టర్ గా ఉన్నప్పుడు వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కి వివాదంగా మారారు. అదే సమయంలో వరి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు.