దిల్ రాజు ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు ముగిశాయి.;

Update: 2025-01-24 02:28 GMT
income tax department, searches,dil raju,  producer
  • whatsapp icon

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు ముగిశాయి. మూడు రోజుల పాటు ఈ సోదాలు నిర్వహించారు. మొత్తం 21 మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. దిల్ రాజు నిర్మించిన సినిమాలు ఇటీవల విడుదలయిన నేపథ్యంలోనే ఈ సోదాలు జరిగినట్లు తెలిసింది. సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ ఛేంజర్ వంటి సినిమాలతో భారీగా పెట్టుబడలు పెట్టారు.

సంక్రాంతి సినిమాలు...
అధికంగా ఆదాయాన్ని ఆర్జించారన్న సమాచారంతోనే ఈ సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. దిల్ రాజుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు. బ్యాంకు లాకర్లను కూడా అధికారుల బృందం తనిఖీలు చేసింది. పలు పత్రాలను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. దిల్ రాజు సన్నిహితులు ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఈ తనిఖీలు జరిగాయి.


Tags:    

Similar News