Telangana : విద్యుత్తు కమిషన్ పై నేడు తీర్పు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్తు కమిషన్ పై వేసిన పిటీషన్ పై నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది.

Update: 2024-07-01 03:57 GMT

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్తు కమిషన్ పై వేసిన పిటీషన్ పై నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు పై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కమిషన్ విచారణను నిలుపుదల చేయాలంటూ కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. నరసింహారెడ్డి విచారణ చేపట్టకముందే మీడియా సమావేశం పెట్టి వివరాలను వెల్లడించడాన్ని కేసీఆర్ తరుపున న్యాయవాదులు తప్పుపట్టారు.

విద్యుత్తు కొనుగోళ్లలో...
విద్యుత్తు కొనుగోళ్లలో అవకతవకాలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ను ఏర్పాటు చేసినసంగతితెలిసిందే. ఈ కమిషన్ కేసీఆర్ కు కూడా నోటీసులు ఇచ్చింది. వివరణ ఇవ్వాలని కోరింది.అయితే విచారణకు రాకుండా కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డికి లేఖ రాశారు. ఈ కమిషన్ ను నిలుపుదల చేయాలంటూ కేసీఆర్ వేసిన పిటీషన్ పై వాదనలు ముగిశాయి. గత శుక్రవారం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. నేడు తీర్పు వెలువరించనుంది.


Tags:    

Similar News