నా భర్త అన్యాయంగా చనిపోయాడు.. కారణం వాళ్ళే

హోంగార్డు రవీందర్ భార్య సంధ్య ఆందోళన చేపట్టింది. తన భర్త మృతికి కారకులైన

Update: 2023-09-08 07:50 GMT

హోంగార్డు రవీందర్ భార్య సంధ్య ఆందోళన చేపట్టింది. తన భర్త మృతికి కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేసింది. రవీందర్ ను అన్యాయంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త చనిపోయాడనే విషయం చెప్పకుండా దొంగ చాటుగా ఉస్మానియా మార్చురీకి తీసుకొచ్చారని ఆరోపించారు. చందు, నర్సింగ్ రావులు తన భర్తను బూతులు తిట్టి, అతన్ని వేధించారని ఆగ్రహం వ్యక్త చేసింది. తనను వేధించడమే కాకుండా, బైక్ లో పెట్రోల్ నింపుతుంటే సిగరెట్ అంటుకుని గాయాలు అయ్యాయని అబద్దం చెప్పారని తెలిపింది. రవీందర్ మృతిపై ఇప్పటి వరకు ఏ అధికారి స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

హైదరాబాద్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన హోంగార్డు రవీందర్ మృతి చెందారు. కంచన్ బాగ్ అపోలో డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జీతాలు ఇవ్వడం లేదని మూడు రోజుల క్రితం హెంగార్డ్ రవీందర్ ఆత్మహత్యాయత్నం చేశారు. చికిత్స నిమత్తం మొదట ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం పోలీసులు అపోలో డీఆర్డీవో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రవీందర్ మృతి చెందారు.జీతాలు రావడం లేదని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు రవీందర్. జీతాలు రావడంలేదని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. జీతాలు రావడంలేదని అడగడానికి వెళితే ఉన్నతాధికారులు అవమానించినట్లు వ్యాఖ్యలు చేయడంతో తాను ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్టు మరణ వాంగ్మూలం ఇచ్చాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.


Tags:    

Similar News