Telangana : సలేశ్వరం జాతర... నిలిచిపోయిన వాహనాలు
తెలంగాణలోని నల్లమల అటవీ ప్రాంతంలో జరిగే సలేశ్వరం జాతరకు భక్తులు అత్యధిక సంఖ్యలో తరలి వచ్చారు;
తెలంగాణలోని నల్లమల అటవీ ప్రాంతంలో జరిగే సలేశ్వరం జాతరకు భక్తులు అత్యధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఆదివారం కావడంతో పాటు మూడు రోజులు మాత్రమే జాతర ఉండటంతో భక్తులు అధిక సంఖ్యలో బారులు తీరారు. దీంతో తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా శ్రీశైలం రహదారిపై వాహనాల రద్దీ పెరిగిపోయింది. అనేక వాహనాలు నిలిచిపోయాయి.
భక్తులు అధిక సంఖ్యలో...
రోడ్డు మీదనే అనేక వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య ఎదురయింది. అమ్రాబాద్ నుంచి మన్ననూర్ చెక్ పోస్టు వరకూ అలాగే చెక్ పోస్టు నుంచిసిద్ధాపూర్ వరకూ ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సలేశ్వరం వచ్చిన భక్తులు అదే దారిలో ఉన్న శ్రీశైలానికి కూడా వెళుతుండటంతో ఆ మార్గమంతా వాహనాలతో నిండిపోయింది. దాదాపు ఆరు కిలీమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.