Weather Report : మూడు రోజులు వర్షాలేనట... ఇక హ్యాపీస్
తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మూడు రోజుల పాటు తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వర్షం పడుతుందని తెలిపింది;

తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మూడు రోజుల పాటు తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వర్షం పడుతుందని, వడగళ్ల వాన కూడా కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెిపింది. ద్రోణి ప్రభావం కారణంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు కూడా గరిష్టంగా తగ్గే అవకాశముందని కూడా తెలిపింది. అనేక ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తాయని, ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ ప్రాంతాల్లో వడగళ్ల వాన...
వడగళ్ల వాన కురిసే అవకాశముండటంతో ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తమ పంట ఉత్పత్తులను జాగ్రత్తగా భద్రపర్చుకోవాలని సూచించారు. నిజామాబాద్, వికారాాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో ఈ భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే వడగళ్లు కురిసే ప్రాంతాలను కూడా వాతావరణ శాఖ రివీల్ చేసింది.
ఈ జిల్లాల్లో ఈదురు గాలులు...
మహబూబ్ నగర్, వికారాబాద్, నారాయణపేట, జోగలాంబ గాద్వాల్, వనపర్తి జిల్లాల్లో వడగళ్లు వాన కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంత రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు అధికారులు. ఇక సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, నాగర్ కర్నూలు, నల్లగొండ, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశముందని అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో కొంత వాతవరణం చల్లబడటం మంచి కబురు అయినప్పటికీ , రైతులకు మాత్రం ఇబ్బందికరంగా మారే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.