ఎల్లో అలర్ట్ : మరో రెండు రోజులు వర్షాలు
తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది.;

heavy rains in tamilnadu
తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని తెలిపింది.
ఈ జిల్లాలకు...
ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ మూడు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని కూడా పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ లోనూ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశముందని హెచ్చరించింది.