తెలంగాణలో ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

నేడు, రేేపు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

Update: 2022-08-04 02:49 GMT

నేడు, రేేపు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. పది హేను జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, వికారాబాద్, యాదాద్రి, సంగారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జులై నెలతో భారీగా కురిసిన వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు నిండాయి. ఆగస్టు ప్రారంభంలో కూడా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి ఊరి మీద పడతాయన ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

భారీ వర్షాలతో...
ఇటీవల గోదావరికి వచ్చిన వరదల నుంచి తేరుకోలేక పోతున్న ప్రజలకు మళ్లీ వర్షాలంటేనే భయమేస్తుంది. చినుకు అంటేనే వణికిపోతున్నారు. భారీ వర్షాలకు పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ఇక హైదరాబాద్ నగరంలో అయితే రోజూ సాయంత్రం భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజల అవస్థలు చెప్పలేకుండా ఉంది. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రహదారులన్నీ గుంతలు పడి రాకపోకలకు ఇబ్బందికరంగా మారాయి.


Tags:    

Similar News