తెలుగు రాష్ట్రాలను మళ్లీ కలిపేందుకు కేంద్రం కుట్ర !
తాజాగా మోదీ వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను మళ్లీ కలిపేందుకు బీజేపీ
ఇటీవలే పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ ప్రకటన అనంతరం తెలంగాణ అధికార పక్షమైన టీఆర్ఎస్ కు - కేంద్రానికి మధ్య మాటల యుద్ధం జరిగింది. అది కాస్తా ఇప్పుడు చిలికి చిలికి గాలి, వానలా మారింది. ఉమ్మడి రాష్ట్ర విభజనపై ప్రధాని మోదీ కొద్దిరోజుల క్రితం చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు రగిలిపోతున్నారు. మోదీ వ్యాఖ్యలకు నిరసనగా నేడు తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు నిరసనలు నిర్వహించారు.
Also Read : హిమాలయాల్లో ఫుట్ బాల్ స్టేడియం !
తాజాగా మోదీ వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను మళ్లీ కలిపేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ కంటే.. తెలంగాణ ఎక్కువగా అభివృద్ధి చెందుతుండటాన్ని చూసి ఓర్వలేకపోతున్నారంటూ విమర్శించారు. మోదీ చేసిన వ్యాఖ్యలపై.. వెంటనే తెలంగాణ ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పాలని మంత్రి తలసాని డిమాండ్ చేశారు.