Telangana : మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు తిరిగి ప్రారంభం కానున్నాయి;

telangana assembly today
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు తిరిగి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చా కార్యక్రమం నేడు జరగనుంది. ఈ నెల 19న తెలంగాణ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. ఈరోజు రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చ జరగనుంది. శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ ప్రసంగంపై మాట్లాడారు.
గవర్నర్ ప్రసంగానికి...
ఈరోజు ముఖ్యమంత్రి ప్రసంగంతో పాటు గవర్నర్ కు ధన్యవాదాలు చెప్పే చర్చలో అన్ని పక్షాల నేతలు ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎవరినీ అనుమతి లేకుండా ఆ పరిసర ప్రాంతాల్లోకి కూడా రానివ్వడం లేదు. ఎలాంటి ఆందోళనలకు, ర్యాలీలకు, నిరసనలకు అనుమతి లేదని పోలీసులు ఆంక్షలు విధించారు.