Telangana : అసెంబ్లీలో నేడు రెండు కీలక బిల్లులు
తెలంగాణ ప్రభుత్వం నేడు రెండు కీలక బిల్లులను అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది;

తెలంగాణ ప్రభుత్వం నేడు రెండు కీలక బిల్లులను అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. ఈ రెండు బిల్లులు చారిత్రాత్మకమైనవని అధికార పక్షం చెబుతుంది. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ బిల్లును ప్రవేశ పెడతారు. దీనిని ఆమోదించిన తర్వాత చేసిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు.
బీసీ కులగణన బిల్లు...
బీసీ కులగణన ఇప్పటికే పూర్తి కావడంతో దీనికి సంబంధించిన బిల్లులను నేడు శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఇక మరో కీలక బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తూ బిల్లులను ప్రవేశ పెట్టనున్నారు. దీనిపై కూడా చర్చించి సభ ఆమోదం తెలపనుంది. ఇప్పటికే ఈ రెండు కీలక బిల్లులను మంత్రివర్గం ఆమోదించింది.