కవితకు జైరాం రమేష్ స్ట్రాంగ్ కౌంటర్
కాంగ్రెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీపై విమర్శలు మాని ఈడీ నోటీసుపై ఫోకస్ పెట్టాలని కోరారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి అందరు అగ్రనేతలు వస్తున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో సమావేశం జరపడంపై ప్రత్యేకత ఏమీ లేదని ఆయన తెలిపారు.
రానున్న ఎన్నికల్లో...
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. అధికార బీఆర్ఎస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని జైరాం రమేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరించేందుకు ప్రజలు ఈసారి సిద్థంగా ఉన్నారన్న ఆయన బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటేనని తెలిపారు. రెండు పార్టీలూ కలసి డ్రామాలు ఆడుతున్నాయని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ లభిస్తుందని ఆయన అన్నారు. ఢిల్లీలో మోదీ, హైదరాబాద్ లో కేసీఆర్ ఒకటేనని అన్నారు.