ప్రపంచ రాష్ట్ర సమితిని కూడా పెడతారు.. రేవంత్ ఎద్దేవా
రానున్న కాలంలో ప్రపంచ రాష్ట్ర సమితిని కేసీఆర్ ప్రకటించినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు
తెలంగాణ ప్రజలకు, కేసీఆర్ కు రుణం తీరిపోయిందని పీసీసీ చీఫ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. భారత రాష్ట్ర సమితి పార్టీని ప్రకటించి మరో కుట్రకు కేసీఆర్ తెరలేపారని ఆయన విమర్శించారు. కేసీఆర్ కు ఇక తెలంగాణలో పోట ీచేసే అర్హత లేదని ఆయన అన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని కేసీఆర్ పూర్తిగా చంపేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. గత ఇరవై ఏళ్లుగా కేసీఆర్ ఆర్థికంగా బలోపేతమయ్యారని, ప్రజలను మభ్యపెట్టేందుకే ఇప్పుడు బీఆర్ఎస్ ను ప్రకటించారని రేవంత్ మండి పడ్డారు.
వినాశకాలే....
రానున్న కాలంలో ప్రపంచ రాష్ట్ర సమితిని కేసీఆర్ ప్రకటించినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు కేసీఆర్ వ్యవహారం తయారైందని అన్నారు. రాజకీయ దురాశతోనే కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టారన్న రేవంత్ రెడ్డి తెలంగాణ పదం వినిపించకుండా కుట్ర చేశారని అన్నారు. మరో 12 నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు ఇక కాలం చెల్లిపోయినట్లేనని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.