తెలుగు రాష్ట్రాలకు తీపి కబురు

తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు

Update: 2022-06-14 04:05 GMT

తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాయలసీమలోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. నిన్నటి వరకూ ఎండ వేడమితో అల్లాడిపోయిన ప్రజలకు నైరుతి రుతుపవనాల ఆగమనంతో కొంత ఉపశమనం కలిగింది.

మూడు రోజులు వర్షాలు...
రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అయితే హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి ఈదురు గాలులు కూడా వీచాయి. ఖమ్మం జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. మూడు రోజుల వరకూ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలపడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమయింది.


Tags:    

Similar News