మరోసారి నిప్పులు చెరిగిన కేసీఆర్
ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు.
ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. రోజులు గడుస్తున్న కొద్దీ ప్రధాని మోదీకి పిచ్చి ముదురుతుందని అన్నారు. అందువల్లనే దేశంలో రైతులను ఏడిపిస్తున్నారని కేసీఆర్ అన్నారు. భువనగిరి జిల్లాలో రాయగిరిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మరోసారి బీజేపీపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చి పాలసీలను తీసుకువస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతుందన్నారు. ఏడాది పాటు రైతులను ఏడిపించి తిరిగి చట్టాలను వెనక్కు తీసుకున్నారని చెప్పారు. మోదీని తరిమి తరిమి కొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
ఎనిమిదేళ్లలో....
బీజేపీ ఎనిమిదేళ్ల పాలనలో దేశాన్ని సర్వనాశనం చేసిందన్నారు. నీటి వినియోగాన్ని కూడా సక్రమంగా జరగలేదన్నారు. అసోం ముఖ్యమంత్రి రాహుల్ ను ఉద్దేశించి దిగజారి మాట్లాడారన్నారు. మోదీ ఇదేనా నీ సంస్కారం అంటూ ప్రశ్నించారు. ఆ మాటలు విన్న వెంటనే నా కళ్ల వెంట నీళ్లు వచ్చాయన్నారు. విద్యుత్తు సంస్కరణల పేరుతో రాష్ట్రాల మెడ మీద కత్తి పెట్టి మీటర్లను పెట్టాలంటుందని కేసీఆర్ ఫైర్ అయ్యారు.
ఎవరికీ భయపడను...
తాను ఎవరికీ భయపడేవాడిని కాదన్నారు. తన అంతు తేలుస్తామని బీజేపీ నేతలు అంటున్నారని అహంకారమా? కళ్లు నెత్తికెక్కాయా? అని ప్రశ్నించారు. అమెరికాలో ఎక్కువ శాతం మంది క్రైస్తవులు ఉంటారని, అక్కడ మతతత్వం లేకపోవడం వల్లనే అగ్రరాజ్యమయిందన్నారు. ఇక్కడ మతతత్వ బీజేపీ ఉంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారా? అని కేసీఆర్ ప్రశ్నించారు. కర్ణాటకలో ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా? అని ఆయన అన్నారు.