Telangana : ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ పై నేడు కీలక తీర్పు

ఎమ్మెల్యే ల అనర్హత పిటిషన్ పై నేడు హైకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది

Update: 2024-11-22 04:22 GMT

Telangana high court

బీఆర్ఎస్ ఎమ్మెల్యే ల అనర్హత పిటిషన్ పై నేడు హైకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. బిఆర్ ఎస్ పార్టీ పై గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన దానం, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి పై స్పీకర్ చర్యలు తీసుకునేలా అదేశాలు ఇవ్వాలని కోరుతూ బి ఆర్ ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపై విచారణ జరిపింది.

రిట్ అప్పీల్ పై...
పార్టీ మారిన ఎం ఎల్ ఎల పై నాలుగు వారాల్లోగా టైం ఫ్రెమ్ ఫిక్స్ చేయాలని స్పీకర్ కు సింగిల్ బెంచ్ ఆదేశించింది. సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాలు చేస్తూ హై కోర్టు డివిజన్ బెంచ్ లో అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ చేశారు. అసెంబ్లీ కార్యదర్శి రిట్ అప్పీల్ పై తీర్పు నేడు హైకోర్టు ప్రకటించనుంది.


Tags:    

Similar News