ఖబడ్దార్ మోదీ... ఇది తెలంగాణ పులిబిడ్డ
దేశం నుంచి తన్ని తరిమేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోదని హెచ్చరించారు.
దేశం నుంచి తన్ని తరిమేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోదని హెచ్చరించారు. మోడీ జాగ్రత్త నీ ఉడుత బెదిరింపులకు భయపడేప్రసక్తి లేదని చెప్పారు. దేశం కోసం పోరాడదామా? జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిద్దామా? అని కేసీఆర్ ప్రజలను కోరారు. జనగామలో జరిగిన బహిరంగ సభలో ఆయన మోదీపైనా, బీజేపీ పైనా మండి పడ్డారు. కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఆయన ఎండగట్టారు. సమైక్య ఆంధ్రుల పాలనలో పూర్తిగా నష్టపోయిన తెలంగాణను బాగుపర్చుకుంటున్న దశలో కేంద్ర ప్రభుత్వం దానిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందన్నారు.
ఢిల్లీ కోటను బద్దలు కొడదాం....
బావులకు విద్యుత్తు మీటర్లు పెట్టాలని కేంద్రం వత్తిడి తెస్తుందని, ఎట్టిపరిస్థితుల్లో పెట్టబోమని కేసీఆర్ స్పష్టం చేశారు. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పైసా ఇవ్వకున్నా మన బతుకులు మనం బతుకుతున్నామన్నారు. ఏదో ఉన్నంతలో మంచిగా చేసుకుంటున్నామని చెప్పారు. అటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం పెట్టే నిబంధనలకు తలొగ్గేది లేదన్నారు. మీరందరూ పంపిస్తే ఢిల్లీకోటను బద్దలు కొడదాం అని పిలుపు నిచ్చారు. సిద్దిపేట వాళ్లు పంపిస్తే తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్నామని, ఇప్పుడు బీజేపీని దేశం నుంచి తరిమి కొట్టి రాష్ట్రాలను రక్షించుకోవాలని ఆయన అన్నారు. బీజేపీ బిడ్డల్లారా... పిడికెడంత లేని మీరు మా జోలకి వస్తే మసి అయిపోతారని కేసీఆర్ హెచ్చరించారు.