జగన్ మీటర్లు ఎందుకు పెట్టారు?
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే కొన్ని వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టారని తెెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మోదీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ అబద్దాలాడుతున్నారన్నారు. బోరు బావులకు మీటర్లు పెడతామని కేంద్రం నుంచి తమకు ముసాయిదా బిల్లును పంపారన్నారు. తాను చెబుతుంది అబద్ధమంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శ్రీకాకుళం జిల్లాకు వెళ్లి చూడాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా మోటార్లకు మీటర్లు పెడుతున్నారని, అక్కడకు వెళ్లి చూసుకోవాలన్నారు. పార్లమెంటులో ఈ ముసాయిదా బిల్లు ఆమోదం పొందక ముందే తమను అమలు పర్చమని వత్తిడి చేస్తున్నారన్నారు. మోదీ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని చెప్పారు.
తెలంగాణలో పెట్టేది లేదు....
మీటర్లు పెట్టమనకుండానే జగన్ మీటర్లు పెడతారా? అని కేసీఆర్ నిలదీశారు. ఏపీలో ఇప్పటికే కొన్ని వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టారన్నారు. మీటర్లు పెడితే 0.5 శాతం ఎఫ్ఆర్ఎంబీ అదనంగా ఇస్తామని చెప్పారన్నారు. విద్యుత్ సంస్కరణలపై అబద్దాలు ఆడుతున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణకు 25 వేల కోట్లు నష్టం వస్తుందని తెలిసినా తాను మీటర్లు పెట్టలేదన్నారు. తాను మోదీ చెప్పినట్లు మీటర్లు పెట్టే ప్రసక్తి లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. మిషన్ భగీరధ ప్రారంభోత్సవానికి వచ్చిన మోదీ కూడా అబద్దాలే చెప్పారని అన్నారు. ౨౪ గంటలు విద్యుత్తు ఇస్తు్నా రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ చెప్పారు.