నేడు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం
నేడు గాంధీభవన్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది;

caste enumeration in telangana
నేడు గాంధీభవన్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు జరగనున్న ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులతో పాటు పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొననున్నారు.
వివిధ అంశాలపై...
మీనాక్షి నటరాజన్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి గా నియమతులైన తర్వాత తొలిసారి హైదరాబాద్ కు వస్తుండటంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, కులగణన సర్వే వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలపై కూడా ఈ మావేశంలో చర్చ జరిగే అవకాశముంది.