టీడీపీతో పొత్తు ప్రచారం మాత్రమే

టీడీపీతో పొత్తు కుదురుతుందంటున్నది కేవలం ప్రచారం మాత్రమేనని తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ చుగ్ అన్నారు.;

Update: 2023-01-13 07:33 GMT
tdp, bjp, alliance, telangana
  • whatsapp icon

టీడీపీతో పొత్తు కుదురుతుందంటున్నది కేవలం ప్రచారం మాత్రమేనని తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ చుగ్ అన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకునే ఆలోచన తమకు లేదన్నారు. తెలంగాణలో ఒంటరిగా పోట ీచేసే శక్తి భారతీయ జనతా పార్టీకి ఉందని ఆయన తెలిపారు.

ప్రచారం అవాస్తవమే...
టీడీపీతో పొత్తును పెట్టుకుంటున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. 119 నియోజకవర్గాల్లో ఒంటరిగానే పోటీ చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. బీజేపీ తెలంగాణలో పూర్తిగా బలోపేతమయిందని తెలిపారు. బీఆర్ఎస్ ను తెలంగాణలో ఓడించే శక్తి ఒక్క బీజేపీకే ఉందని ఆయన అన్నారు.


Tags:    

Similar News