తెలంగాణకు ఒమిక్రాన్ ముప్పు.. ఇప్పటికే ఏడు కేసులు
తెలంగాణకు ఒమిక్రాన్ ముప్పు ఉన్నట్లే కన్పిస్తుంది. ఇప్పటికే ఏడు కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తున్న అంశం.
భయపడుతున్నట్లే జరుగుతుంది. తెలంగాణకు ఒమిక్రాన్ ముప్పు ఉన్నట్లే కన్పిస్తుంది. ఇప్పటికే ఏడు కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తున్న అంశం. రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలోనే ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదవుతున్నాయి. కొత్త గా తెలంగాణలో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది.
వ్యాక్సినేషన్ తో పాటు పరీక్షలు...
ఇప్పటికే రెండు కేసులు నమోదయిన ఒక కాలనీలో ఉన్న వారందరికీ వైద్య ఆరోగ్య శాఖ పరీక్షలను నిర్వహిస్తుంది. కోవిడ్ టెస్ట్ లు నిర్వహిస్తూ వారిని అప్రమత్తం చేస్తుంది. అలాగే శానిటైజేషన్ తో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం ఏడు కేసులు తెలంగాణలో నమోదు కావడంతో ప్రజలు కూడా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.