కులగణన సర్వేకు మంచి రెస్పాన్స్ : మంత్రి పొంగులేటి

కులగణన సర్వేపై విమర్శలు అర్ధరహితమని మంత్రి పొంగులేటి శ్రీనివాసులురెడ్డి అన్నారు.

Update: 2024-11-18 12:02 GMT

కులగణన సర్వేపై విమర్శలు అర్ధరహితమని మంత్రి పొంగులేటి శ్రీనివాసులురెడ్డి అన్నారు. హైదరాబాద్ లో 37 శాతం సర్వే పూర్తయిందని ఆయన తెలిపారు. ఈ నెల 30వ తేదీతో కులగణన సర్వే పూర్తి అవుతుందని ఆయన తెలిపారు. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా ఈ సర్వేలో భాగస్వామ్యులయి, తమ కుటుంబ వివరాలను అందించారన్నారు. సర్వేను ఫార్మాట్ ప్రకారం కంప్యూటరీకరిస్తామని తెలిపారు. సర్వే సరైన మార్గంలో నడుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి మీడియా సమావేశంలో వివరించారు.

ఎవరికి ఏది అవసరమో?
ఏ కుటుంబానికి ఎంత అవసరమో ఈ కులగణన సర్వే ద్వారా తెలుస్తుందని, తద్వారా ప్రభుత్వం వారికి సంక్షేమ పథకాలను అందించేందుకు వీలవుతుందని ఆయన వివరించారు. కులగణన సర్వేలో తెలిపిన వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని పొంగులేటి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సమగ్ర సర్వే ఏమయిందని పొంగులేటి ప్రశ్నించారు. ఆ సర్వే వివరాలను ఎందుకు బయట పెట్టలేదని పొంగులేటి ప్రశ్నించారు. త్వరలోనే ఈ సర్వే పూర్తయిన తర్వాత ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వెలువడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసులురెడ్డి తెలిపారు.


Tags:    

Similar News