రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగిన కేటీఆర్
మణిపూర్‌లో జరిగినట్టే లగచర్లలో జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ అన్నారు
మణిపూర్‌లో జరిగినట్టే లగచర్లలో జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. గిరిజనుల భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అణగారిన వర్గాల గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తెలంగాణలో ఇలా ఎందుకు జరుగుతోందని కేటీఆర్ ప్రశ్నించారు. అమాయకులైన గిరిజనులను అరెస్ట్ చేసి జైలులో పెట్టడం మానవ హక్కుల ఉల్లంఘన అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఉభయ సభల్లో ప్రస్తావిస్తాం...
ఈ అంశాన్ని బీఆర్ఎస్ తరపున రాజ్యసభలో లేవనెత్తుతామన్న కేటీఆర్ పార్లమెంటులోనూ ఈ సమస్యలపై ప్రస్తావిస్తామని తెలిపారు. రాహుల్ గాంధీ ఇప్పటికైనా ఈ అంశాన్ని పట్టించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గిరిజనులతో నేరుగా రేవంత్ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే కొడంగల్‌లో దౌర్జన్యం పెరిగిందన్న మాజీ మంత్రి కేటీఆర్ గిరిజనుల భూములను లాక్కుంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. తాము రేవంత్ రెడ్డి కూలదోసేందుకు ప్రయత్నం ఎందుకు చేస్తామని ఆయన ప్రశ్నించారు.