Telangana : హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్
హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు టీజీఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పంది;

హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు టీజీఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పంది. తెలంగాణ రవాణా సంస్థ బస్సుల్లో ప్రయాణిస్తే రాయితీలు ప్రకటించింది. లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సిటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో టీజీ ఆర్టీసీ పది శాతం రాయితీని ఇచ్చింది. రాజధాని ఏసీ సర్వీసుల్లో ఎనిమిది శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది.
ప్రతి గంటకు ఒక బస్సు...
టీజీ ఆర్టీసీ బస్సులు ప్రతి గంటకు కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయని, ఎక్కువ సమయం వేచి చూడకుండానే విజయవాడకు వెళ్లవచ్చని,ఎప్పుడు బస్టాండ్ కు వచ్చినా విజయవాడకు వెళ్లేబస్సు సిద్ధంగా ఉంటుందని తెలిపింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వారు ఈ సర్వీసులను ఉపయోగించుకోవచ్చని తెలిపింది.