Alert : 24 గంటలే సమయం.. ఇప్పుడు చెల్లించకుండా రోడ్డు మీదకు వచ్చారో.. ఇక అంతే
పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు రాయితీ పొందడానికి మరో ఇరవై నాలుగు గంటలు మాత్రమే గడువు ఉంది. రేపటితో రాయితీ ముగియనుంది
పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు రాయితీ పొందడానికి మరో ఇరవై నాలుగు గంటలు మాత్రమే గడువు ఉంది. రేపటితో రాయితీ ముగియనుంది. దీంతో పెండింగ్ చలాన్లు తమ వాహనాలకు ఉంటే చెల్లించాలని పోలీసు ఉన్నతాధికారులు కోరుతున్నారు. భారీ స్థాయిలో రాయితీ ఇవ్వడం వల్ల వాహనదారులకు ఉపయోగమని, ఈ ఛాన్స్ మిస్ చేసుకుంటే మరొక అవకాశముండదని కూడా అధికారులు చెబుతున్నారు. పెండింగ్ చల్లాన్లపై రాయితీ గడువు రేపటితో ముగియనుంది.
ఈ నెల 10వ తేదీ వరకూ...
పెండింగ్ చలాన్ల రాయితీ గడువు ఈ నెల 10వ తేదీ వరకూ ఉంటుందని ముందుగానే పోలీసు శాఖ తెలిపింది. దీంతో రేపటితో గడువు ముగియనుంది. తెలంగాణ వ్యాప్తంగా 3.59 కోట్ల చలాన్లు పెండింగ్ లో ఉన్నాయని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇందులో దాదాపు ఎనభై లక్షల చలాన్ల వరకూ క్లియర్ అయ్యాయని అంటున్నారు. ఇప్పటి వరకూ చలాన్ల రూపంలో 67 కోట్ల రూపాయలు వసూలయిందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
రాయితీ రేపటి వరకే...
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం పెండింగ్ చలాన్లకు రాయితీ ఇచ్చింది. ద్విచక్రవాహనాలకు, ఆటోలకు ఎనభై శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు అరవై శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. గత నెల 26వ తేదీన ప్రారంభమైన ఈ చలాన్లకు మంచి స్పందనే లభించింది. ఒక్క హైదరాబాద్ జంట నగరాల్లో 32 కోట్ల రూపాయలు రాయితీ రూపంలో ఆదాయం లభించినట్లు అధికారులు వెల్లడించారు. రేపటితో గడువు ముగియడంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. రేపటి తర్వాత ఇక రాయితీ లభించదని, అప్పుడు రోడ్డు మీదకు వెహికల్ వస్తే పూర్తి మొత్తాన్ని వసూలు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.