రేవంత్ సంచలన వ్యాఖ్యలు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు. త్వరలో నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనానికి సిద్ధమయ్యారన్నారు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు. త్వరలో నలుగురు రాజ్యసభ సభ్యiలు బీజేపీలో విలీనానికి సిద్ధమయ్యారని తెలిపారు. నలుగురు సిద్ధంగా ఉన్నారని, ఒకరు జమ అయితే విలీనం అయినట్లేనని ఆయన తెలిపారు. టీఆర్ఎస్, బీజేపీల మధ్య యుద్ధం ఒట్టిమాటేనని తెలిపారు. కేసీఆర్ కుటుంబంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి చర్యలు ప్రారంభించిందన్న ప్రచారం జరుగుతుందన్నారు. టీఆర్ఎస్, బీజేపీ మాత్రమే యుద్ధక్షేత్రంలో ఉన్నారని, కాంగ్రెస్ పోటీ లేదన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నారన్నారు. తాను ఎన్నికల కమిషన్ లో ఫిర్యాదు చేశానని తెలిపారు. మరో టీడీపీలాగా టీఆర్ఎస్ తయారవుతుందన్నారు. పశ్చిమ బెంగాల్ తరహా వ్యూహాన్ని ఇక్కడ రచిస్తున్నారన్నారు. బీజేపీని ప్రధాన ప్రతిపక్షంగా తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
పార్టీ పేరు మార్పుపై...
పార్టీ పేరు మార్పు విషయంలో కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తానని తెలిపారు. టీఆర్ఎస్ గులాబీ కూలీ పేరు మీద వసూలు చేసిన నిధులను ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించారని రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీ పేరు మీద నిధులు వసూలు చేశారన్నారు. నిధుల సేకరణ విషయం కేంద్ర ఎన్నికల కమిషన్ కు తెలపలేదన్నారు. పేరు మార్చి అదే సింబల్ ను అదే జెండాను ఎలా పెట్టుకుంటారన్నాని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ హైకోర్టు నుంచి తప్పించుకోవడానికే భారత రాష్ట్ర సమితిగా పేరు మర్చారన్నారు. టీఆర్ఎస్ చందాల విషయం తేలే వరకూ పేరు మార్చవద్దని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.