టీఆర్ఎస్ ఎంపీకి సుప్రీంలో ఎదురుదెబ్బ
టీఆర్ఎస్ కు చెందిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది
టీఆర్ఎస్ కు చెందిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీబీ పాటిల్ ఎన్నికల అఫడవిట్ లో తనపై ఉన్న నేరాలను పేర్కొనలేదని కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ వేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టు విచారించింది. ఆ కేసును తిరిగి పరిశీలించి ఆరునెలల్లో వేగవంతంగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా తనపై ఉన్న నేరాలను గత పార్లమెంటు ఎన్నికల సమయంలో అఫడవిట్ లో బీబీ పాటిల్ పేర్కొనలేదని ఆయన పిటీషన్ వేశారు.
మరోసారి హైకోర్టులో...
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన బీబీ పాటిల్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మదన్ మోహన్ పిటీషన్ ను గతంలో హైకోర్టు కొట్టివేసింది. దీంతో మదన్ మోహన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆరునెలల్లో వేగవంతంగా విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు హైకోర్టును ఆదేశించింది. దీంతో మరోసారి జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కేసును హైకోర్టు విచారణ చేయాల్సి ఉంది.