వశిష్ట ఆపరేషన్ సక్సెస్ ఇలా

గోదావరిలోని కచ్చలూరు వద్ద మునిగిపోయిన బోటును వెలికితీయడానికి ధర్మాడి సత్యం బృందం 11 రోజులు కష్టపడింది. బోటు మునిగి 38 రోజులైనా ప్రకృతి సహకరించకపోవడంతో దశలవారీగా వెలికితీసే [more]

;

Update: 2019-10-22 14:07 GMT
గోదావరి బోటు ప్రమాదం
  • whatsapp icon

గోదావరిలోని కచ్చలూరు వద్ద మునిగిపోయిన బోటును వెలికితీయడానికి ధర్మాడి సత్యం బృందం 11 రోజులు కష్టపడింది. బోటు మునిగి 38 రోజులైనా ప్రకృతి సహకరించకపోవడంతో దశలవారీగా వెలికితీసే పనులు చేపట్టారు. రాయల్ వశిష్టా బోటు సెప్టెంబర్ 15న గోదావరిలో మునిగిపోయింది. ఆ సమయంలో నది ఉదృతి ఎక్కువగా ఉంది. దీంతో బోటును వెలికితీసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. నేవీ, ఎన్డీఆర్ఎఫ్, విపత్తు నిర్వహణ బృందాలు కూడా సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. చివరికి కాకినాడకు చెందిన ధర్మాడి బృందం రంగంలోకి దిగింది. సెప్టెంబరు 28న అన్వేషణ మొదలు పెట్టింది. ఐదు రోజుల పాటు గాలింపు ప్రక్రియ చురుగ్గా సాగినా వరద పోటెత్తడంతో అక్టోబర్ 3న ఆపరేషన్ నిలిపివేసింది. ప్రవాహం తగ్గడంతో తిరిగి అక్టోబర్ 16న మరోసారి ప్రయత్నాలు చేశారు. ఆ రోజు నుంచి ఐరన్ రోప్, లంగర్ల సాయంతో పడవమునిగిన ప్రాంతాన్ని గుర్తించారు. ఏడురోజుల పాటు కష్టపడ్డ ధర్మాడి బృందం ఇవ్వాళ బోటు వెలికితీయడంలో సక్సెస్ సాధించింది.

 

Tags:    

Similar News