తాట తీస్తామంటే ….?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ తాట తీస్తామంటే ఊరుకునే వారు ఎవరూ లేరిక్కడ [more]

;

Update: 2019-11-04 06:32 GMT
అంబటి రాంబాబు
  • whatsapp icon

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ తాట తీస్తామంటే ఊరుకునే వారు ఎవరూ లేరిక్కడ అని ఘాటుగా స్పందించారు. చంద్రబాబు అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడమే పవన్ పాలసీ అని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. విజయసాయిరెడ్డిని విమర్శించే స్థాయి పవనకు లేదన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. మంత్రి కన్నబాబు పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. పవన్ కల్యాణ్ కుదురుగా రాజకీయం చేసుకుంటే మంచిదని అంబటి హితవు పలికారు. జగన్ పై పెట్టిన కేసులన్నీ అవాస్తవాలని ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.

Tags:    

Similar News