నవయుగకు మరో షాక్

పోలవరం ప్రాజెక్టు బాధ్యతల నుంచి నవయుగను తప్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా బందరుపోర్టు విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. బందరు పోర్టు ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తూ [more]

;

Update: 2019-08-09 01:56 GMT
సీఐడీ
  • whatsapp icon

పోలవరం ప్రాజెక్టు బాధ్యతల నుంచి నవయుగను తప్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా బందరుపోర్టు విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. బందరు పోర్టు ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బందరు పోర్టు నిర్మాణంలో నవయుగ సంస్థ లీడ్ ప్రమోటర్ గా వ్యవహరిస్తుంది. గత కొంతకాలంగా కాంట్రాక్టు సంస్థలు బందరుపోర్టు విషయంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నందున ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. లీజుపై ఇచ్చిన 412 ఎకరాలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోనుంది.

Tags:    

Similar News