జుట్టుకు రంగేసుకొని శబరిమల ఆలయానికి..!

గత వారం ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత కేరళలో చేలరేగిన అలజడి ఇంకా సద్దుమణగక ముందే మరో మహిళ ఆలయ ప్రవేశం చేసింది. పైగా [more]

Update: 2019-01-10 07:38 GMT

గత వారం ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత కేరళలో చేలరేగిన అలజడి ఇంకా సద్దుమణగక ముందే మరో మహిళ ఆలయ ప్రవేశం చేసింది. పైగా 18 మెట్లు ఎక్కి మరీ ఆలయంలోకి వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వీడియో రూపంలో ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. కేరళలోని కొల్లాంకు చెందిన మంజు(36) వామపక్ష అనుబంధ సంఘంలో చురుగ్గా పనిచేస్తోంది. గత అక్టోబరులో శబరిమలలోకి అన్ని వయస్సుల మహిళలు వెళ్లవచ్చని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆలయ ప్రవేశానికి ప్రయత్నం చేసిన 20 మంది మహిళల్లో మంజు ఒకరు.

నల్ల జుట్టుకు తెల్లరంగు వేసుకుని…

అప్పుడు ఆమె విఫలం కావడంతో ఈసారి మళ్లీ ప్రయత్నం చేసి ఆలయంలోకి ప్రవేశించింది. అదికూడా తన వయస్సును ఎవరూ గుర్తుపట్టకుండా, ఎక్కువ వయస్సు మహిళగా కనిపించేలా నల్ల జుట్టుకు తెల్ల రంగు వేసుకుని మరి వెళ్లింది. తాను జుట్టుకు తెల్లరంగు వేసుకుని, ఎవరి రక్షణ అవసరం లేకుండా ఆలయానికి వెళ్లానని, రెండు గంటల పాటు అక్కడే ఉన్నానని ఆమె ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

Tags:    

Similar News