వారికి జగన్ బ్లెస్సింగ్స్

వైఎస్సార్‌సీపీ అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహ రిసెప్షన్ కు ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. విశాఖ జిల్లా గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన [more]

Update: 2019-10-22 14:03 GMT

వైఎస్సార్‌సీపీ అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహ రిసెప్షన్ కు ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. విశాఖ జిల్లా గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కసిరెడ్డి శివప్రసాద్‌తో ఎంపీ మాధవి వివాహం జరిగింది. మాధవి స్వగ్రామం శరభన్నపాలెంలో ఈ నెల 17న తెల్లవారుజామున 3.15 గంటలకు ఈ వివాహం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆరోజు బిజీగా ఉండడంతో మాధవి విహహ వేడుకకు హాజరుకాలేదు. ఈరోజు విశాఖలో జరుగుతున్న వివాహ రిసెప్షన్ కు హాజరైన జగన్ నూతన దంపతులను ఆశీర్వదించారు.

 

 

Tags:    

Similar News