నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు

Update: 2023-03-14 01:42 GMT

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశమై సభ ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటుంది. పదమూడు రోజుల పాటు బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలియ వచ్చింది. ఈ నెల 16వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే వ్యవసాయ బడ్జెట్ ను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

12 గంటలకు కేబినెట్...
మొత్తం పన్నెండు బిల్లులు సభలో పెట్టి ఈ సమావేశాల్లో ఆమోదించుకోవాలని ప్రభుత్వం భావిస్తుందని తెలియవచ్చింది. ఉగాది, ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో సభను నిర్వహించనున్నారు. 2.60 కోట్ల మేర బడ్జెట్ ను ఈసారి ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశముంది. మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి వర్గ సమావేశం జరగనుంది. గవర్నర్ ప్రసంగంతోొ పాటు అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులు, బడ్జెట్ కు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతుండటంతో ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడంతో సంక్షేమానికి ప్రధమ ప్రాథాన్యతను ప్రభుత్వం ఇవ్వనుంది.


Tags:    

Similar News