జగన్ – కేటీఆర్ భేటీ వెనుక బీజేపీ అజెండా

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు స్పందన లేదని, అందుకే హడావిడిగా జగన్ తో సమావేశమయ్యారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ఎద్దేవా చేశారు. గురువారం ఆయన అందుబాటులో ఉన్న [more]

;

Update: 2019-01-17 07:04 GMT
chandrababu naidu comments on kcr
  • whatsapp icon

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు స్పందన లేదని, అందుకే హడావిడిగా జగన్ తో సమావేశమయ్యారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ఎద్దేవా చేశారు. గురువారం ఆయన అందుబాటులో ఉన్న మంత్రులతో అమరావతిలో సమావేశమై జగన్ తో టీఆర్ఎస్ నేతల చర్చలు, కోల్ కత్తా టూర్ పై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… నిన్నటి భేటీతో టీఆర్ఎస్, వైసీపీ ముసుగు తొలిగిపోయిందని పేర్కొన్నారు. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీల్చాలని టీఆర్ఎస్ తో కలిసి వైసీపీ దొంగ నాటకాలు ఆడుతుందని ఆరోపించారు.

బీజేపీ అజెండాతోనే…..

ఏపీకి హోదా ఇస్తే తెలంగాణకూ ఇవ్వాలని కేసీఆర్ అన్నారని, ఇప్పుడు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్ కి అడ్డుపడకుండా ఉంటారా అని ప్రశ్నించారు. బీజేపీ అజెండా అమలు చేయడానికి ఫెడరల్ ఫ్రంట్ అని తెలిపారు. అవినీతి గొంగళి పురుగును కేసీఆర్ కౌగిలించుకున్నారని ఆరోపించారు. మోదీ చెప్పింది చేయడమే కేసీఆర్ కర్తవ్యమని, మోదీ చేతిలో జగన్ కీలుబొమ్మ అని పేర్కొన్నారు. తెలంగాణలో 26 కులాలను బీసీల నుంచి తేసేసి టీఆర్ఎస్ ఏపీలో బీసీలపై కపటప్రేమ చూపుతుందన్నారు. టీఆర్ఎస్ తో కలిసి వైసీపీకి బీసీలే బుద్దిచెప్పాలని కోరారు. రేపు సాయంత్రం చంద్రబాబు కోల్ కత్తా వెళ్లి విపక్షాల ర్యాలీలో పాల్గొననున్నారు.

Tags:    

Similar News