ఈసీ నిర్ణయంపై చంద్రబాబు మార్క్ ట్విస్ట్

తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇంటెలిజెన్స్ డీజీ తో పాటు ఇద్దరు ఎస్పీలను విధుల నుంచి తప్పించాలని ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం ట్విస్ట్ [more]

;

Update: 2019-03-27 10:54 GMT
ab venkateswararao intellegence chief andhra pradesh
  • whatsapp icon

తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇంటెలిజెన్స్ డీజీ తో పాటు ఇద్దరు ఎస్పీలను విధుల నుంచి తప్పించాలని ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం ట్విస్ట్ ఇచ్చింది. ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేస్తూ ముగ్గురిని బదిలీ చేస్తూ నిన్న ప్రభుత్వం ఇచ్చిన 716 జీఓను ఇవాళ రద్దు చేసింది. కేవలం ఇద్దరు ఎస్పీలను మాత్రమే బదిలీ చేస్తూ, ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీని మినహాయిస్తూ ఇవాళ 720 జీఓను విడుదల చేసింది. దీంతో ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ నిలిచిపోయింది. ఆయన తన విధుల్లో కొనసాగనున్నారు.

Tags:    

Similar News