డిప్యూటీ స్పీకర్ ఎన్నికలో కాంగ్రెస్ ఫిటింగ్

డిప్యూటీ స్పీకర్ ఎన్నికల ఏకగ్రీవం చేయాలనుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఝలక్ ఇచ్చింది. డిప్యూటీ స్పీకర్ గా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావును ఖరారు చేసిన [more]

Update: 2019-02-23 06:14 GMT

డిప్యూటీ స్పీకర్ ఎన్నికల ఏకగ్రీవం చేయాలనుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఝలక్ ఇచ్చింది. డిప్యూటీ స్పీకర్ గా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావును ఖరారు చేసిన కేసీఆర్ ఏకగ్రీవానికి సహకరించాల్సిందిగా అన్ని పార్టీలనూ కోరారు. ఇందుకు ఎంఐఎం, బీజేపీ అంగీకరించాయి. ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో చర్చించేందుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఇవాళ ప్రతిపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క, ఇతర ముఖ్యనేతలతో భేటీ అయ్యారు.

దీనికి ఒకే అయితేనే….

డిప్యూటీ స్పీకర్ ఏకగ్రీవానికి తాము మద్దతు ఇస్తామని అయితే ఎమ్మెల్సీ ఎన్నికలో ఒక స్థానానికి తమకు సహకరించాల్సిందిగా షరతు పెట్టారు. త్వరలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరనున్నాయి. ఇప్పడున్న బలం ప్రకారం టీఆర్ఎస్ కు నాలుగు స్థానాలు కచ్చితంగా వస్తాయి. కాంగ్రెస్ కు సరిపడా బలం లేకపోయినా ఒక స్థానం దక్కే అవకాశం ఉంటుంది. కానీ, ఐదు స్థానాలూ తామే దక్కించుకోవాలని భావించిన టీఆర్ఎస్ ఒక స్థానాన్ని వారి మిత్రపక్షం ఎంఐఎంకు వదిలేసి మిగతా నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేశారు. ఒక ఎమ్మెల్సీ స్థానం తమకు వదిలేయాలని కాంగ్రెస్ పెట్టిన షరతుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి చెబుతానని కేటీఆర్ చెప్పారు.

Tags:    

Similar News