విద్యాశాఖ మంత్రిని భర్తరఫ్ చేయాలి

ఇంటర్ బోర్డులో అవకతవకల వల్ల రాష్ట్రంలో 9.5 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై [more]

Update: 2019-04-22 10:23 GMT

ఇంటర్ బోర్డులో అవకతవకల వల్ల రాష్ట్రంలో 9.5 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన లేఖ రాశారు. ఇంటర్ బోర్డు వల్ల విద్యార్థుల జీవితాలు ఆగమ్యగోచరంగా మారాయని ఆరోపించారు. ఈ అవకతవకలకు బాధ్యతగా విద్యాశాఖ మంత్రిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియెట్ బోర్డును ప్రక్షాళన చేయాలని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags:    

Similar News