విజయసాయిరెడ్డి ఓ డర్టీ మ్యాన్.!

విజయసాయిరెడ్డి ఓ డర్టీ మెన్ అని, అవినీతిలో కూరుకుపోయిన బురద మనుషులు జగన్, విజయసాయిరెడ్డి అని మంత్రి దేవినేని ఉమ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన [more]

;

Update: 2019-05-02 07:28 GMT
దేవినేని ఉమామహేశ్వరరావ
  • whatsapp icon

విజయసాయిరెడ్డి ఓ డర్టీ మెన్ అని, అవినీతిలో కూరుకుపోయిన బురద మనుషులు జగన్, విజయసాయిరెడ్డి అని మంత్రి దేవినేని ఉమ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… జగన్ కు సహకరించిన అధికారులు, నేతలంతా జైలుకెళ్లారని ఆరోపించారు. జగన్ కు ఇరిగేషన్ పైన ఏమాత్రం అవగాహన లేదని, జగన్ కు చివరకు ముఖ్యమంత్రి నేమ్ ప్లేట్ మాత్రమే మిగులుతుందని ఎద్దేవా చేశారు. ఆల్మట్టి గేట్లపై తాము ఐదేళ్లుగా సుప్రీం కోర్టులో పోరాడుతున్నామని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోరాడామని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వల్లే కృష్ణా నదిలో 448 టీఎంసీల మేర ప్రాజెక్టులు కట్టుకునే హక్కును కోల్పోయామని ఆరోపించారు.

Tags:    

Similar News