కోడెల ఎందుకు బాధపడ్డారో తెలుసా

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణం అందరిని కలిచివేసింది. ఆయన మృతి చెందిన వార్త విని టీడీపీ నాయకులు, అభిమానులు బసవతారకం ఆసుపత్రికి తరలివచ్చారు. అక్కడి [more]

;

Update: 2019-09-16 11:42 GMT
కోడెల శివ‌ప్ర‌సాద్
  • whatsapp icon

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణం అందరిని కలిచివేసింది. ఆయన మృతి చెందిన వార్త విని టీడీపీ నాయకులు, అభిమానులు బసవతారకం ఆసుపత్రికి తరలివచ్చారు. అక్కడి నుంచి పార్ధీవ దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించగా అభిమానులంతా అక్కడికి వెళ్లారు.

నాన్న మధనపడ్డారు…..

కోడెల శివప్రసాద్ వారం రోజులుగా మదనపడుతున్నారని, తీవ్ర ఒత్తిడితో ఉన్నారని ఆయన కూతురు విజయలక్ష్మి స్పష్టం చేశారు. టిఫిన్ చేసి ఫస్ట్ ఫ్లోర్ పైకి వెళ్లారని, అరగంట తరువాత నేను పైకి వెళ్లి చూసే సరికే నాన్న ఉరివేసుకుని ఉన్నారని పోలీసులకు తెలిపారు. నాన్న ఎందుకు మదనపడ్డారోననే విషయం మాత్రం తెలియదన్నారు. మాకు ఎటువంటి అనుమానం లేదని, నాన్న సొసైడ్ నోట్ కూడా ఏమి రాయలేదని చెప్పారు.

తనయుడే చంపేశాడు…

మరోవైపు కోడెల మేనల్లుడు సాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడెలను శారీరకంగా, మానసికంగా ఆయన తనయుడు శివరాం వేధించాడని సాయి సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో ఎన్నో సార్లు కొడుకు వ్యవహారతీరును వివరించారని శివరాం క్షోభతోనే ఇవ్వాలకోడెల మృతిచెందాడని సాయి ఆవేదన వ్యక్తం చేశారు.

 

Tags:    

Similar News