జగన్ కు సెల్యూట్ చేస్తున్నా

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో కమ్మ సామాజిక వర్గానికి న్యాయం జరగలేదని, జగన్ పాలనలో రెడ్లకు న్యాయం [more]

;

Update: 2019-12-11 08:26 GMT
జేసీ దివాకర్ రెడ్డి
  • whatsapp icon

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో కమ్మ సామాజిక వర్గానికి న్యాయం జరగలేదని, జగన్ పాలనలో రెడ్లకు న్యాయం జరుగుతుందని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. ఇందుకు జగన్ ను అభినందిస్తున్నానని తెలిపారు. రాయలసీమ ప్రాజక్టుల విషయంలో అసెంబ్లీలో జగన్ బాగా మాట్లాడారని జేసీ దివాకర్ రెడ్డి కితాబిచ్చారు. చంద్రబాబు చేయలేని పనులను జగన్ చేసి చూపిస్తున్నారన్నారు. మాఫియా చెలరేగిపోతుందని ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడకుండా ఉండాల్సిందని జేసీ అభిప్రాయపడ్డారు. ఆరోగ్యశ్రీపై జగన్ కు సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. జగన్ హయాంలో తాత రాజారెడ్డి పాలన సాగుతుందన్నారు. రెడ్డిరాజ్యంలో కక్ష రాజ్యం అని ఈ ప్రభుత్వానికి పేరు పెట్టాల్సిందేనన్నారు.

Tags:    

Similar News