హైకోర్టు అసహనం

ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ హైకోర్టుకు తన నివేదిక సమర్పించారు. అయితే తప్పుడు లెక్కలు సమర్పించడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. 2018 నుంచి 2019 వరకూ [more]

;

Update: 2019-11-01 11:17 GMT

ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ హైకోర్టుకు తన నివేదిక సమర్పించారు. అయితే తప్పుడు లెక్కలు సమర్పించడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. 2018 నుంచి 2019 వరకూ ఆర్టీసీకి రావాల్సిన నిధుల గురించి ప్రభుత్వానికి చెప్పారా? అలాగే జీహెచ్ఎంసీ ఇవ్వాల్సిన నిధులపై లేఖ రాశారా? అని హైకోర్టు సునీల్ శర్మను నిలదీసింది. ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఉండి కూడా కోర్టుకు తప్పుడు సమాధానాలు చెబుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్ట ప్రకారం జీహెచ్ఎంసీ ఇవ్వాల్సిన నిధులు ఎందుకు తేలేదన్నారు. మరోనివేదికను సమర్పించాలని హైకోర్టు సునీల్ శర్మను ఆదేశించింది. వచ్చే గురువారానికి ఆర్టీసీ సమ్మెపై విచారణను వాయిదా వేసింది.

Tags:    

Similar News