మరికాసేపట్లో జగన్ – కేటీఆర్ భేటీ

తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా పలు రాష్ట్రాల్లో వివిధ పార్టీల నేతలను కలిసిన కేసీఆర్… వైసీపీ అధినేత జగన్మోహన్ [more]

;

Update: 2019-01-16 06:17 GMT
jagan ktr meeting
  • whatsapp icon

తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా పలు రాష్ట్రాల్లో వివిధ పార్టీల నేతలను కలిసిన కేసీఆర్… వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో కూడా చర్చించాలనుకుంటున్నారు. ఇందుకోసం ముందుగా కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందాన్ని జగన్ వద్దకు పంపిస్తున్నారు. ఇవాళ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, ఎంపీ వినోద్, పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డి మరికాసేపట్లో లోటస్ పాండ్ లో జగన్ ని కలవనున్నారు. పలువురు వైసీపీ సీనియర్ నేతలు కూడా ఈ భేటీలో పాల్గొననున్నారు. అయితే, తెలంగాణ ఎన్నికల తర్వాత చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత పెరిగింది.

Tags:    

Similar News