జగన్ కు ఆ దమ్ము, ధైర్యం, సామర్థ్యం ఉన్నాయి

తెలుగు రాష్ట్రాలు ఖడ్గచాలనం చేసుకోవొద్దని, కరచాలనం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ… ‘‘అఖండ విజయాన్ని సాధించిన [more]

;

Update: 2019-05-30 07:52 GMT
జగన్
  • whatsapp icon

తెలుగు రాష్ట్రాలు ఖడ్గచాలనం చేసుకోవొద్దని, కరచాలనం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ… ‘‘అఖండ విజయాన్ని సాధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవయువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ పక్షాన హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు. తెలుగు ప్రజల జీవనగమనంలో ఇది ఉజ్వల ఘట్టం. తెలుగు ప్రజలంతా ప్రేమ, పరస్పర సహకారంతో ముందుకు వెళ్లేందుకు ఈ ఘట్టం భీజం వేస్తోంది. ముఖ్యమంత్రిగా జగన్ వయస్సు చిన్నది కానీ బాధ్యత పెద్దది. ఆ బాధ్యత నిర్వర్తించే ధైర్యం, సామర్థ్యం, శక్తి ఉందని తొమ్మిదేళ్లుగా నిరూపించారు. తండ్రి నుంచి వచ్చిన వారసత్వం ఆయనను అద్భుతంగా ముందుకు నడిపిస్తుందని ఆశిస్తున్నా. జగన్ పాలనాకాలంలో ప్రజలంతా సుభీక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. రెండు రాష్ట్రాల ప్రజలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్లాలి. గోదావరి జలాల సంపూర్ణ వినియోగం జగన్ హయాంలో జరుగుతుంది. తండ్రి పేరు నిలబెట్టేలా జగన్ అద్భుతమైన కీర్తిప్రతిష్టలు అందుకోవాలని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

Tags:    

Similar News