పవన్ తో కేసీఆర్, కేటీఆర్ ముచ్చట్లు

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనీటి విందులో ఆసక్తికరంగా సాగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ గవర్నర్ [more]

;

Update: 2019-01-26 12:46 GMT
kcr and pawan attend at home programme
  • whatsapp icon

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనీటి విందులో ఆసక్తికరంగా సాగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ గవర్నర్ రోశయ్య, తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రి పితాని సత్యనారాయణ, తెలంగాణ ప్రతిపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క, వివిధ పార్టీల నాయకులు కేటీఆర్, పవన్ కళ్యాణ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, లక్ష్మణ్, జానారెడ్డి, తదితరులు హాజరయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కేసీఆర్, కేటీఆర్ ముచ్చటించడం ఆసక్తి కలిగించింది. ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ నేత జానారెడ్డి ఆలింగనం చేసుకున్నారు. వివిధ పార్టీల నేతలను కేసీఆర్ పలుకరించారు. పలువురు రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags:    

Similar News