వంశీ పార్టీని వీడరు

వల్లభనేని వంశీ పార్టీని వీడరని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని తెలిపారు. వల్లభనేని వంశీతో చర్చించేందుకు ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణకు చంద్రబాబు [more]

;

Update: 2019-10-28 10:06 GMT
కేశినేని నాని
  • whatsapp icon

వల్లభనేని వంశీ పార్టీని వీడరని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని తెలిపారు. వల్లభనేని వంశీతో చర్చించేందుకు ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణకు చంద్రబాబు బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే వంశీది టీడీపీ డీఎన్ఏ అని, ఆయన ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారబోరని కేశినేని తెలిపారు. వల్లభనేని వంశీ ఏదైనా వైసీపీ ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కొంటుంటే పార్టీ మద్దతుగా నిలుస్తుందన్నారు. వంశీ ఎదుర్కొంటున్న ఇబ్బందులేమిటో, ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో తొలుత తీసుకున్న తర్వాత ఆ విషయాలను చంద్రబాబుకు తెలుపుతామన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే ఇబ్బందులు పడుతుంటే తాము చూస్తూ ఊరుకోబోమని కూడా కేశినేని నాని తెలిపారు.

Tags:    

Similar News