బ్రేకింగ్ : యురేనియంపై డెసిషన్

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని మైనింగ్ శాఖ మంత్రి కె.టి.రామారావు స్పష్టం చేశారు. ఈరోజు శాసనసభలో ఆయన ఈ వివరణ [more]

;

Update: 2019-09-15 05:36 GMT
యురేనియం
  • whatsapp icon

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని మైనింగ్ శాఖ మంత్రి కె.టి.రామారావు స్పష్టం చేశారు. ఈరోజు శాసనసభలో ఆయన ఈ వివరణ ఇచ్చారు. అవసరమైతే యురేనియం తవ్వకాల పై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని కేటీఆర్ చెప్పారు. మైనింగ్ తవ్వకాలపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్, మంత్రివర్గంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పెద్దయెత్తున ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News