పోలవరం ఏటీఎం అంది ఎవరో?

రివర్స్ టెండర్ల విషయంలో న్యాయనిపుణులతో చర్చిస్తున్నామని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. పోలవరం రివర్స్ టెండర్లపై న్యాయనిపుణులతో చర్చించిన తర్వాతనే ముందుకు వెళతామన్నారు. [more]

Update: 2019-08-24 11:36 GMT

రివర్స్ టెండర్ల విషయంలో న్యాయనిపుణులతో చర్చిస్తున్నామని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. పోలవరం రివర్స్ టెండర్లపై న్యాయనిపుణులతో చర్చించిన తర్వాతనే ముందుకు వెళతామన్నారు. పోలవరరం హెడ్ వాటర్ వర్క్స్, హైడల్ ప్రాజెక్టు కు విడివిడిగా టెండర్లకు వెళ్లాలా? అన్న దానిపై ఆలోచిస్తున్నామన్నారు. పోలవరంపై రివర్స్ టెండర్లు వద్దు అని హైకోర్టు చెప్పలేదన్నారు అనిల్ కుమార్. పోలవరం చంద్రబాబుకు ఏటీఎంలా మారిందని ప్రధాని మోదీయే విమర్శించిన విషయాన్ని అనిల్ కుమార్ గుర్తు చేశారు. వరదను చంద్రబాబు నివాసాన్ని ముంచడానికే తీసుకొచ్చామని ఆయన చేస్తున్న విమర్శలు అర్ధరహితమన్నారు.

Tags:    

Similar News