జగన్ గురించి ఆళ్ల చెప్పిందిదే…!!

తనకు సీటు ఇచ్చినా ఇవ్వకున్నా ఎప్పటికీ జగన్ సైనికుడినే అని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ… 2009లోనూ తనకు పెదకూరపాడు [more]

;

Update: 2019-03-06 07:06 GMT
ఆళ్ల రామకృష్ణారెడ్డి
  • whatsapp icon

తనకు సీటు ఇచ్చినా ఇవ్వకున్నా ఎప్పటికీ జగన్ సైనికుడినే అని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ… 2009లోనూ తనకు పెదకూరపాడు సీటు ఇచ్చి తీసేశారని, అయినా వైఎస్ కుటుంబాన్ని వీడలేదని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా తనకు జగన్ మాటే శిరోధార్యమని, ఆయన ఆదేశాల మేరకే నడుచుకుంటానన్నారు. ఇంకా జగన్ అభ్యర్థులను ప్రకటించలేదని పేర్కొన్నారు. తన అనుచరులు లోటస్ పాండ్ వద్ద గొడవ చేసిన విషయం తనకు తెలియదన్నారు. తన కోసం రాజీనామా చేసిన నేతలను ఉపసంహరించుకోవాలని చెప్పినట్లు తెలిపారు.

Tags:    

Similar News