బ్రేకింగ్: జనసేనలోకి అన్నయ్య.. పోటీ అక్కడి నుంచే..!

పవన్ కళ్యాణ్ సోదరుడు, నటుడు నాగబాబు జనసేన పార్టీలో చేరనున్నారు. మరికాసేపట్లో ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు. నాగబాబు నర్సాపురం పార్లమెంటు స్థానం నుంచి [more]

;

Update: 2019-03-20 06:53 GMT
జనసేన
  • whatsapp icon

పవన్ కళ్యాణ్ సోదరుడు, నటుడు నాగబాబు జనసేన పార్టీలో చేరనున్నారు. మరికాసేపట్లో ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు. నాగబాబు నర్సాపురం పార్లమెంటు స్థానం నుంచి జనసేన తరపున పోటీ చేయనున్నారు. నాగబాబు గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చురుగ్గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జనసేనలో అధికారికంగా చేరకున్నా పవన్ కళ్యాన్ కు, జనసేనకు మద్దతుగా సోషల్ మీడియాలో తరచూ మాట్లాడుతున్నారు. ఇటీవల గుంటూరులో పార్టీ కార్యకర్తల సమావేశంలోనూ ఆయన పాల్గొన్నారు. ఎన్నికల వేళ ఆయన అధికారికంగా పార్టీలో చేరి పోటీ చేయనున్నారు.

Tags:    

Similar News